శ్రీశాంత్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court Issues Notices To Sreesanth

07:07 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Delhi High Court Issues Notices To Sreesanth

2013 ఐపిఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుకున్న భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది . శ్రీశాంత్ పై పోలీసులు తీసుకోనున్న చర్యలను ఖండిస్తు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీ పోలీసులు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. దీని పై స్పందించాల్సిందిగా శ్రీశాంత్ , అంకిత్ చవాన్, అజత్ చండిలాతో పాటు ఫిక్సింగ్ లో భాగం ఉన్న మరో 33 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. మొత్తం 36 మంది పై మోసానికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ వారందరి పై ఢిల్లీ పోలీసులు జులై 30,2013 న ఛార్జ్ షీట్ ను తెరిచారు.

అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్,దావూద్ ఇబ్రహీంలు కూడా ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసు వెనుక ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. ఐతే ఆ 36 మందికి దావూద్ అనుచరులతో సంభందం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు నిరూపించలేక పోయారని కోర్టు అభిప్రాయపడింది.

మొత్తానికి ఈ కేసు నుండి బయటపడ్డాడననుకున్న శ్రీశాంత్ కు ఈ పరిణామం షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.

English summary

Delhi High Court Issues Notices TO Sreesanth and 35 other people who were involved in IPL6 spot fixing