నేరాల బాట పట్టిన యంగ్ బిజినెస్ మేన్..

Delhi Man Takes Car Rent And Sells And Again Steals In The Same Night

11:04 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Delhi Man Takes Car Rent And Sells And Again Steals In The Same Night

అవునా ఇదే ఖర్మ అనుకోవడం సహజం.. కానీ పరిస్థితులు అతన్ని అటు మళ్ళించాయట. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఢిల్లీకి చెందిన యువ బిజినెస్ మేన్ ఏకంగా రూటు మార్చేసి, తనలోని అసలు రూపాన్ని బయటపెట్టాడు. 28 ఏళ్ల మింటూ కుమార్ బీసీఏ గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు. ఢిల్లీ లో నివాసం ఉంటున్నాడు. ఓ కారును అద్దెకు తీసుకుని దాని యజమానిగా పేపర్స్ రెడీ చేసి ఆన్ లైన్ లో అ‍మ్మకానికి పెట్టి.. ఓ వ్యక్తికి అమ్మేశాడు. సీన్ కట్ చేస్తే.. అదే రోజు నైట్ కొత్త యజమాని నుంచి డూప్లికేట్ తాళంతో కారును మింటు దొంగలించాడు. ఇలాగే మోసం చేసి ఇదే కారును ఇంకొకరికి అమ్మేశాడు.

ఎవరికీ దొరక్కుండా చేసుకుంటూ వస్తున్న మింటు ప్లాన్ బెడిసికొట్టడంతో చివరకు జైలు పాలయ్యాడు. వారం కిందట పోలీసులకు ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అన్ని విషయాలు బయటపెట్టాడు. ఒక కారుని ఏకంగా అమ్మిన ఏడు గంటల్లో దొంగతనం చేశానని చెప్పి పోలీసులకు షాకిచ్చాడు. మింటుకుమార్ ఫాదర్ ఆర్మీలో కెప్టెన్ గా చేసి రిటైరయ్యాడు. ఇక మింటూ ఫరీదాబాద్ లో చిన్న బిజినెస్ పెట్టాడు. అందులో నష్టాలు రావడంతో మనీ రికవరీ కోసం నేరాల బాట పట్టి, చివరకు పోలీసులకు చిక్కాడు.

ఇవి కూడా చదవండి:అందులోకి వెళ్లొద్దన్నందుకు కన్నతల్లిని హతమార్చారు

ఇవి కూడా చదవండి:కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఐఐటి ఖరగ్ పూర్ మాజీ విద్యార్థి

English summary

Delhi Police arrested a Businessman for taking car rent and selling the cars and again he used to theft the car at the same night and he used to sell it again. Delhi Police filed case on him and arrested and taken him into their custody,