ఆమె అమ్మ కాదు ... దెయ్యం...

Delhi Mother Severely Beats Her Child

10:56 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

Delhi Mother Severely Beats Her Child

అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. తాను ఎన్నికష్టాలు పడైనా సరే.. కడుపున పుట్టిన బిడ్డను సంతోష పెట్టాలి అనుకుంటుంది. దేవుడు అందరి దగ్గర ఉండలేక అమ్మను సృష్టించాడని అంటూ ఉంటారు. ప్రేమానురాగాలను పంచిపెట్టడంలో అమ్మను మించినవాళ్ళు ఉండరంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ తల్లి బిడ్డ పాలిట యుముడిలా తయారైంది. దెయ్యంలా పూనకంతో ఊగిపోయింది. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో ఉన్న ఓ మహిళలో ‘అమ్మ’కు బదులు హింసించే వ్యక్తి కనిపించింది. ముద్దులొలికే బిడ్డను ఇష్టానుసారం చితక్కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ తల్లి ఏమిచేసిందటే, 18 నెలల చిన్నారని కూడా చూడకుండా నేలకు విసిరికొట్టి, కాలికి ఉన్న చెప్పు తీసి కర్కశంగా కొట్టింది. అంతటితో ఆగలేదు, కాలితో బాబుని తీవ్రంగా బాధించింది. నొప్పిని తట్టుకోలేక బాబు విలవిలలాడిపోయాడు. డిల్లీకి చెందిన షబ్నం అనే మహిళ తన కుమారుడిని ఇలా చిత్రహింసలు పెట్టింది. ఆమె అత్తగారు అక్కడికి వెళ్ళి అడ్డుకునే వరకు ఈ హింసాకాండను ఆపలేదు. ఆమె అత్తామామలు డిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్ కు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సమర్పించారు. దీనిపై డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. ఇంత కిరాతకంగా ఉన్న వీడియో చూస్తే ఎంతటి కఠిన హృదయమైనా చలిస్తుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి: దారుణం:15వ అంతస్తు నుంచి 5 ఏళ్ల బాలికను విసిరేసింది

ఇవి కూడా చదవండి: మిల్క్ బ్యూటీ గురించి షాకింగ్ విషయాలు

English summary

A Mother in Delhi Beats her son very severely and the whole thing was recorded in camera and a case was filed on her for beating small baby like that.