మరో 8 కోట్ల క్యాష్ ని పోలీసులు పట్టారు

Delhi Police Seized 8 Crore Rupees

11:48 AM ON 12th December, 2016 By Mirchi Vilas

Delhi Police Seized 8 Crore Rupees

ఓ పక్క ఐటి దాడులు,మరోపక్క పోలీసుల సోదాల నడుమ కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో చేతివాటం ప్రదర్శించి , కమీషన్లకు ఆశపడి పెద్దఎత్తున నగదును బడా బాబులకు అందించినట్లు పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. కోట్లకు కోట్ల రూపాయలు దాడుల్లో పట్టుబడుతున్నాయి. తాజాగా ఢిల్లీ గ్రేటర్ కైలాష్ ఏరియాలోని ఓ కార్యాలయంపై నగర క్రైం బ్రాంచి పోలీసులు దాడి జరిపి 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు కోట్లు కొత్త కరెన్సీలో ఉన్నట్టు వారు తెలిపారు. వారు ఈ ఆఫీసు గదుల తలుపులు మూసివేసి దాడులు జరుపుతున్నప్పుడు ఓ కేర్ టేకర్ మాత్రమే అక్కడున్నాడు.

స్వాధీనం చేసుకున్న సొమ్ము 8 కోట్ల పైమాటే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ దాడి గురించి ఐటీ శాఖకు తెలియజేసినట్టు పోలీసులు చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గ ప్రాంతంలో ఓ హవాలా డీలర్ ఇంటి బాత్ రూమ్ లో దాచిన 5.7 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి: గార్డును హత్య చేసి ఏటీఎంను దోచుకున్నారు

ఇవి కూడా చదవండి: స్వైప్ చేస్తే కోటీశ్వరుడు అవుతారా ... అదెలాగో తెలుసుకోండి

English summary

IT raids were going in All Over India and so much amount of Black money was recovered and new 2000 rupee notes were also there in that and bank officials were mixing hands with them and giving new currency notes to them by taking commission.