ఫేస్ బుక్ లో చాటింగ్.. హోటల్లో గడిపారు .. ఆతర్వాత ఏమైందో తెలిస్తే షాకవుతారు

Delhi Woman And Teenage Boy accuse each other of rape

11:18 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Delhi Woman And Teenage Boy accuse each other of rape

సోషల్ మీడియా ఎలా ఉపయోగించుకుంటే అలా వినియోగం అవుతోంది. అందుకే కొందరు ఆకతాయిలు , ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదులు సైతం సోషల్ మీడియాను బ్రష్టు పట్టించేలా చేస్తున్నారు. అదీ కాక అమ్మాయిలను వల్లో వేసుకోడానికి కూడా ఫేస్ బుక్ ని ఆయుధంగా వాడుకుంటున్నారు. అలాంటిదే ఇదీనూ ... అతను 17 ఏళ్ల బాలుడు. ఆమె 26 ఏళ్ల మహిళ. ఇద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా, మరింత ముందుకు వెళ్ళింది. అంతే, ఇద్దరూ ఏకాంతంగా గడిపేందుకు ఓ హోటల్ కు వెళ్లారు. సరససల్లాపాలు సాగించారు. ఆ మత్తు వదిలాక ఒకరి మీద ఒకరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. చూడడానికి ఏదో సస్పెన్స్ త్రిల్లర్ మూవీగా ఉన్న ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో ‘జిందా’ పేరుతో ఉన్న 26 ఏళ్ల యువతితో ఓ 17 ఏళ్ల బాలుడు పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రత్యక్షంగా కలిసి ఏకాంతంగా గడపాలని భావించి దానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ లో కలిశారు. ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. అయితే కొద్దిసేపు తర్వాత ఆ యువతి పోలీసులకు ఫోన్ చేసి, తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులను చూసిన బాలుడు అవాక్కై, ఆ మహిళపై రివర్స్ లో కేసు పెట్టాడు. తనతో ఏకాంతంగా గడిపేందుకు ఆ యువతే ఆహ్వానించిందని, లైంగిక సంబంధం కోసం బలవంతం చేయడంతోనే తాను అంగీకరించానని పోలీసులకు ఆ బాలుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు దిమ్మతిరిగి పోయింది. చివరికి ఇద్దరి పైనా కేసులు పెట్టారు. బాలుడిపై అత్యాచారం కేసు, యువతిపై ‘పోస్కో’ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా హనీ ట్రాపింగ్ లో భాగంగా జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: కేసీఆర్ ని అశోకునితో పోల్చిన సూపర్ స్టార్

ఇది కూడా చూడండి: అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

English summary

17 years boy and 26 years Delhi Woman chatting on Facebook. Woman, teenage boy accuse each other of rape.