ఒక్క రూపాయికే డెల్‌ ల్యాప్‌టాప్‌!

Dell laptops and desktops only for one rupee

02:59 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Dell laptops and desktops only for one rupee

ఒక్క రూపాయికే డెల్‌ ల్యాప్‌టాప్‌. అవును మీరు వింటుంది నిజమే ఒక్క రూపాయికే డెల్‌ ల్యాప్‌టాప్‌ ని మీ సొంతం చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ మరియు డెస్క్‌టాప్‌ ల అమ్మకాల్లో నంబర్ వన్‌గా దూసుకుపోతున్న డెల్‌ కంపెనీ ఇప్పుడు సరికొత్త అమ్మకానికి శ్రీకారం చుట్టింది. అదే 'బ్యాక్‌ టూ స్కూల్‌'. ఇదేంటంటే దీని ద్వారా విద్యార్ధులు కానీ వారి పేరంట్స్‌ కానీ ఒక్క రూపాయిని చెల్లించి కొత్త ల్యాప్‌టాప్‌ ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్‌ ఉంది. మిగతా డబ్బుని ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో కట్టాలి. ఈ ఆఫర్‌ మార్చి 31 నుండి మే 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ డెల్‌ డెస్క్‌టాప్‌ లో ఉన్న అన్ని మోడెల్స్ తో పాటు ల్యాప్‌టాప్‌ ల్లో ఉన్న ఇన్స్‌పిరాన్‌ 3000(Inspiron 3000) మరియు ఫోర్త్‌ జనరేషన్‌ కోర్‌ ఐ3 నోట్‌బుక్‌ మోడల్స్‌కు మాత్రమే వర్తిస్తాయి.

అయితే డెల్‌ డెస్క్‌టాప్‌ మరియు ల్యాప్‌టాప్‌ కొనాలనుకున్న వారు అధనంగా 999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా 999 రూపాయలు చెల్లించి కొన్నవారికి కంపెనీ 2 సంవత్సరాలు గ్యారంటీతో పాటు వారంటీ కూడా ఇస్తుంది. అలాగే ఒక సంవత్సరం ఎడ్యురైట్‌ కంటెంట్‌ ప్యాక్‌తో(Edurite Content Pack) పాటు షాపింగ్‌ చెయ్యడానికి వోచర్‌ కార్డులు కూడా ఉచితంగా ఇస్తారు. ఈ ఆఫర్‌ డెల్‌ ఆదరైజ్డ్‌ డీలర్‌ దగ్గర మాత్రమే లభిస్తుంది. కావాల్సిన వారు అక్కడకెళ్లి రిజిష్టర్‌ చేయించుకోవాలి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వండి. http://www.dellbacktoschooloffer.com/

English summary

Dell laptops and desktops only for one rupee. Now we can bought Dell Laptops and Desktops for only one rupee then remaining amount can pay by installments.