వైర్‌లెస్‌ మానిటర్లు విడుదల చేసిన డెల్

Dell Wireless Monitors

05:32 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Dell Wireless Monitors

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్‌ సరికొత్త వైర్ లెస్ మానిటర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిని వైర్‌లెస్‌ మొబైల్‌ ఛార్జర్‌గా కూడా వాడుకోవచ్చు. హెచ్‌డీ డిస్‌ప్లేతో 23 అంగుళాల తెర కలిగిన ఈ మానిటర్‌ను విండోస్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ డివైస్‌లతో ఉపయోగించవచ్చు. బ్లూటూత్‌, మిరాకాస్ట్‌తో కనెక్ట్‌ చేసుకోవాలి. డిస్‌ప్లే కింద గల బేస్‌కి ఛార్జింగ్‌ ప్యాడ్‌లు ఉంటాయి. వీటి ద్వారా మొబైల్‌కు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న మరిన్ని ఫీచర్లు ఏంటంటే.. 3 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లు, యూఎస్‌బీ 2.0, 178 డిగ్రీల దృశ్యకోణంతో హెచ్‌డీ డీస్‌ప్లే మొదలైనవి. దీనితోపాటు 4 యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, 24 అంగుళాల తెర కలిగిన మరో మానిటర్‌ను కూడా త్వరలో డెల్‌ విడుదల చేయనుంది. దీనికి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ లేదు. మార్చి 31న ఈ మానిటర్‌లు యూఎస్‌ మార్కెట్‌లోకి రానున్నాయి. అయితే భారత్ తో పాటు మిగతా దేశాల్లో ఎప్పుడు ఇవి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు.

English summary

Dell Launched wireless monitors.Dell announced at CES 2016, there are two additional new displays, each of which has both traditional wired connectivity as well as support for wireless display