ద్వారక, సోమ్ నాథ్ లో విధ్వంసానికి కుట్ర.. హై ఎలర్ట్

Destruction in Dwaraka and Somnath

04:33 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Destruction in Dwaraka and Somnath

అసలే పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకుంటే, మరో పక్క దేశంలో విధ్వంసం సృష్టించాలని ముష్కరులు కుట్ర పన్నారట. గుజరాత్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ద్వారకాదీశ్, సోమ్ నాథ్ ఆలయాలపై ఉగ్రవాదులు కన్నేసినట్లు, అక్కడ పెను విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ తమ ఏజెంట్లను పంపినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్(సీఐ) హెచ్చరికలు చేస్తోంది. దాదాపు 12 నుంచి 15 మంది ఐఎస్ఐ ఏజెంట్లు జలమార్గం ద్వారా గుజరాత తీరంలో ప్రవేశించవచ్చని, లేదంటే ఇప్పటికే చొరబడి ద్వారక, మండల్ పట్టణాల్లో నక్కి ఉండవచ్చని సీఐ హెచ్చరించిందని గుజరాత్ డీజీపీ పేర్కొన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు వద్ద రెండు ఫిషింగ్ బోట్లు భారత జలాల్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నాయనీ పేర్కొన్నట్లు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు.

1/4 Pages

తీరం వెంబడి అప్రమత్తం..


తీరం వెంబడి కీలకమైన పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు, ద్వారక, సోమ్ నాథ్ వంటి ప్రముఖ మందిరాలు ఉండటంతో హైఅలర్ట్ ఆదేశాలు జారీ చేశామని దేవభూమి-ద్వారకా జిల్లా ఎస్పీ ఆర్జే పర్గీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హైవేలు, రైల్వే, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వద్ద పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. కాగా రావి నది తీరంలో అనుమానాస్పద బోటు స్వాధీనమైన మరుసటిరోజే మరో బోటు లభ్యమవడం కలకలం సృష్టిస్తోంది. కచ్ ప్రాంతంలో ద్వారకలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్న పాక్ కు చెందిన బోటును బుధవారం అధికారులు సీజ్ చేశారు. బోటులో 9మంది పాక్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీల్లో వీరి వద్ద పేలుళ్లకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలుస్తోంది. అయితే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English summary

Destruction in Dwaraka and Somnath