మన స్పెషల్ మిలటరీ ట్రైనింగ్ ఎలాంటిదో తెలుసా?

Details about our special military training

04:11 PM ON 30th September, 2016 By Mirchi Vilas

Details about our special military training

పాకిస్తాన్ సాగించిన దురాగత దాడి అందరినీ కలచివేసింది. ఇక ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న భారత బలగాలు అదను కోసం వేచి చూశాయి. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. నియంత్రణ రేఖ దాటి వెళ్లి పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టించి, ముష్కర ముఠా అంతుచూసిన భారత పారా ప్రత్యేక దళ కమాండోలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సరిహద్దుల అవతలకు వెళ్లి రహస్య ఆపరేషన్లు సాగించడంలో సిద్ధహస్తులైన ఈ యోధులు మన సైన్యానికే నిప్పు కణికలు అని చెప్పాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రత్యేక బలగాల్లో ఒకటిగా మన బలగానికి పేరుంది. అంతర్జాతీయంగా జరిగిన పలు పోటీల్లో మన ప్రత్యేక బలగాలు ఇతర దేశాల దళాలను ఓడించాయి.

పారా రెజిమెంట్ ను 1945లో ఏర్పాటు చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రద్దు చేశారు. వీటిని తిరిగి 1952లో పునరుద్ధరించారు. 1966లో ప్రత్యేక దళాలుగా తీర్చిదిద్దారు. ఈ కమాండోలను విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి శత్రుభూభాగంలోకి జారవిడుస్తారు. వీరు మెరుపు వేగంతో శత్రువుకు నష్టం కలిగించి, వెనక్కి వస్తారు. ఇక ఈ దళ సభ్యులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారే. సైన్యంలోని మెరికల్లాంటి యువకులు వీటిలో చేరేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అయితే కఠోరమైన ఎంపిక, శిక్షణ ప్రక్రియను దాటడం చాలా కష్టం. 10 శాతం కన్నా తక్కువ మందే తుది వరకూ నిలబడతారు. మనకోసం సరిహద్దుల్లో ఉంటున్న ఆర్మీ ఎలాంటి శిక్షణ తీసుకుంటుందో తెలుసుకుందాం.

1/9 Pages

1. శిక్షణ సమయంలో వీరికి రెండు మూడు గంటల మించి నిద్రను అనుమతించరు.

English summary

Details about our special military training