మెగాస్టార్ ని 'దేవదాస్' అంతమాట ఎందుకన్నట్టు ?

Devadas Kanakala About Chiranjeevi

09:58 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Devadas Kanakala About Chiranjeevi

నటనలో శిక్షణ ఇచ్చి, తీర్చిదిద్దిన గురువే తనను ఇంటికి రావద్దని అన్నారా? మరి ఆ శిష్యుని మనస్సు నొచ్చుకుందా? ఇంతకీ అంతమాట అనేసిన ఆ గురువు ఎవరు? శిష్యుడెవరు? వివరాలలికి వెళితే, ఎందరో నటులకు నట శిక్షణ ఇచ్చిన నటుడు - దర్శకుడు కనకాల దేవదాస్ లక్ష్మి దంపతులు ఈ రహస్యాన్ని ఓ టివి చానెల్ ఇంటర్యూలో చెప్పేసారు. చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్‌ సుధాకర్ , సుభాకర్ , శుభలేఖ సుధాకర్ లాంటి నట దిగ్గజాలకు శిక్షణ ఇచ్చి, నాలుగు దశాబ్దాల నుంచీ చిత్ర పరిశ్రమలో నటులుగా, శిక్షకులుగా దేవదాసు కనకాల వెలుగొందారు.

ఓసారి చిరంజీవి తెల్లారుజామున దేవదాస్ ఇంటికి వెళ్ళాడట. చిరు చిత్రం విడుదలైన సందర్భమేమో, ఇలా చిరు వచ్చిన గంట సేపటికే ఆ ఇంటి చుట్టూ జనం మూగేసారట. ఇదిలా వుంటే, ఆ తర్వాత ఓసారి, మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ బ్యాచ్‌లు జరిగేటప్పుడు చిరంజీవిని దేవదాస్ కనకాల అక్కడికి తీసుకెళితే, అక్కడ కూడా ఒకటే జనం. దీంతో ‘అయ్యా నువ్వు మా ఇంటికి రావొద్దు. నేనే మీ ఇంటికి వస్తాను. చూడాలనుకున్నపుడు కాల్‌ చేస్తే నేను వస్తాను’ అనేసారట దేవదాస్. ఆ తర్వాత డాక్టరేట్‌ వచ్చినపుడు గురువుని ఇంటికి పిలిపించుకుని మరీ ఆత్మీయంగా మాట్లాడాడట మెగాస్టార్. ఇక చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు దేవదాస్ కనకాల ఇంటికి వచ్చి సరదాగా కబుర్లాడుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయట.

English summary

Senior Actor devadas kanakala said that he said that he said mega star Chiranjeevi to not to come to his home . He said that because of when chiru came to his house then Devadas Kanakala House surroundings was filled with the fans of chiranjeevi and thats the reason that behind that incident