దేవాన్ష్ బర్త్ డే డిన్నర్ అదరహో

Devansh Birthday Celebrations In Vijayawada

12:12 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Devansh Birthday Celebrations In Vijayawada

ఇప్పుడు అందరికీ సెంటర్ ఎట్రాక్షన్ లోకేష్ ... అదేనండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకైక కొడుకు... అందరూ చినబాబుగా వ్యవహరిస్తుంటారు. చినబాబుకి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మంత్రులు , ఇతర తెలుగు తమ్ముళ్ళు వరుస గా గళం వినిపిస్తున్నారు... మరి మంత్రి పదవి ఏమో గాని, ... ఇక ఆ చినబాబు పుత్ర రత్నం ... చంద్రబాబు , బాలయ్యల ముద్దుల మనవడు మనవడు దేవాన్ష్‌ మొదటి పుట్టిన రోజు వేడుక మాత్రం కన్నులపండువగా జరిగింది. దేవాన్ష్‌ పుట్టిన రోజును ఆంగ్ల కేలండర్‌ ప్రకారం గత నెల 21న హైదరాబాద్‌లో చేశారు. అప్పట్లో కుటుంబసభ్యులను, సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించి  విందు ఇచ్చిన చంద్రబాబు తిథి ప్రకారం దేవాన్ష్‌ తొలి పుట్టిన రోజును శుక్రవారం రాత్రి విజయవాడలోని ఎ-కన్వెన్షన్‌ హాలులో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు సీఎం విందు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:''గౌతమీపుత్ర శాతకర్ణి’ పై బాలయ్య క్లారిటీ

సుమారు మూడు గంటలపాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం దేవాన్ష్‌ చిరునవ్వులతో సందడి చేశాడు. ప్రముఖుల చేతులు మారుతూ.. వారితో కలిసి ఫొటోలకు ఫోజులు ఇస్తూ హల్‌చల్‌ చేశాడు. పలువురు ప్రముఖులు చిన్నారితో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. టీటీడీ వేద పండితులు ఆశీర్వచనాలు అందించే సమయంలో మినహా మిగిలిన సమయమంతా దేవాన్ష్‌ నవ్వులు చిందిస్తూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి:టెర్రాస్ పై ఆ పని చేస్తుంటే టీచర్ వీడియో తీసింది

ఈ విందుకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యతోపాటు ఆయన కుమార్తె దీపా వెంకట్‌ కూడా వేడుకకు వచ్చారు. పార్టీలో ముఖ్యులంతా కలసి ఒకేచోట భోజనం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అన్న తేడా లేకుండా అందరూ కలుపుగోలుగా వ్యవహరించారు. దేవాన్ష్‌ తాత, నటుడు బాలకృష్ణ అందరినీ పలకరిస్తూ సందడి సృష్టించాడు. ఎందుకంటే, బాలయ్య వందో సినిమా కూడా వివరాలు వెల్లడించిన ఆనందంలో మనవడి పుట్టినరోజు బాగా ఎంజాయ్ చేసాడు. ఆహుతుల్లో చాలా మంది దేవాన్ష్‌తోను, లోకేశ్‌, బాలకృష్ణ, చంద్రబాబు దంపతులతోను ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. డిన్నర్ అదిరిపొయిందట. మరి దేవాన్ష్ తొలి బర్త్ డే సందర్భంగా 'నాన్నకు ప్రేమతో' మంత్రి పదవిని కూడా తెస్తాడా ఏమిటి? వెయిట్ అండ్ సీ ..

ఇవి కూడా చదవండి:

సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

షార్ట్స్ తో కాలేజీకి అమ్మాయిలు

1/7 Pages

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and Hero Bala Krishna's Grand Son Devansh birthday celebrations were done grandly in Vijayawada Yesterday.