మనవడి మళ్ళీ  బర్త్ డే  అంటూ  తాతయ్య ఆహ్వానం...

Devansh Birthday celebrations on Ugadi

10:42 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Devansh Birthday celebrations on Ugadi

అవునా, ఎపి సిఎమ్ చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు మొన్ననే కదా, కుటుంబ సభ్యుల నడమ హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించారు. మళ్ళీ పుట్టినరోజు ఏమిటబ్బా అనుకుంటున్నారా ? అదే కదా సస్పెన్స్ ... మొన్న జరిగింది ఇంగ్లీషు తేదీల ప్రకారం ఇప్పుడు జరిగేది తిధుల ప్రకారం ... పైగా ఉగాది రోజు ... తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఉగాది నాడు తన మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజు వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో జరుపనున్నారు. ఈమేరకు పిలుపులు కూడా వెళ్ళాయి.

‘ఏప్రిల్‌ 8న ఉగాదినాడు రాజధాని అమరావతిలో నా మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నాం. మొన్న తేదీ ప్రకారం జరిపాం. తిథుల ప్రకారం ఉగాది రోజు వచ్చింది. ఆ రోజు మళ్లీ జరుపుతున్నాం. విందుకు ఆ రోజు మీరంతా తప్పనిసరిగా కుటుంబాలతో సహా రావాలి’ అని సచివాలయంలో మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖల అధిపతులను సిఎమ్ చంద్రబాబు ఆహ్వానించారు. ఆ రోజు అన్ని జిల్లాల్లో పక్కా ఇళ్ల శంకుస్ధాపనలు చేయాలకున్నామని కొందరు మంత్రులు గుర్తుచేయడంతో, దీనిపై కొంత చర్చ జరిగాక.. శంకుస్థాపనల కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు.. రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో అధికారికంగా ఉగాది వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఈ వేడుకల్లో పాల్గొంటారు. మొత్తానికి దేవాన్ష్ ఈ ఉగాదికి పుట్టినరోజుతో సందడి చేయబోతున్నాడు. ఇద్దరు తాత( చంద్రబాబు - బాలకృష్ణ ) లకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు.

ఇవి కూడా చదవండి

'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

పవన్ గుర్రం నితిన్ కి ఎలా వచ్చింది ....

మిస్ ఇండియా కాంపిటేషన్ లో చిత్తూరు నెరజాణ ...

'సర్దార్ ' లో దాగున్న రహస్యాలు

మ్యాచ్ జరుగుతుండగానే బిడ్డను కన్న ప్లేయర్

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu was going to be celebrate his grand son Devansh birthday on Ugadi according to Astrology.Chandra Babu Naidu postponed Government Scheme for his Grand Son Birthday Celebrations.