దేవయానిని ఏడ్పించిన ఎన్టీఆర్!

Devayani gets tears with Ntr acting

01:11 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Devayani gets tears with Ntr acting

తెలుగులో ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో నటనలో ప్రత్యేకమైన శైలి ఉన్న వాడు, రియల్ టాలెంట్ ఉన్న నటుడు ఎన్టీఆర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో మంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ నటన మాత్రం ప్రత్యేకం. భావోద్వేగ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన ప్రతిభను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు కళ్లారా చూశారు. రాఖీ, టెంపర్ వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిధా అయ్యి బ్రహ్మరధం పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని చిత్రాల్లో అయితే ఎన్టీఆర్ ప్రేక్షకులతో కంట తడి కూడా పెట్టించాడు. తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలోని ఒక సన్నివేశంతో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకులను కంట తడి పెట్టించడం ఖాయమని చెప్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ చాలా సీరియస్ గా జరుగుతోంది. ఒక ఎమోషనల్ సన్నివేశాన్ని దర్శకుడు యూనిట్ సభ్యులకు చెప్పి, షూట్ చేస్తున్నాడు. కొరటాల శివ చెప్పినట్లుగా ఆవేశంతో ఎన్టీఆర్ ఆ ఎమోషన్ సీన్ లో రెచ్చిపోయి మరి నటిస్తున్నారు. అంతా సైలెంట్ గా ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్స్ ను వింటూ, ఆయన నటనను చూస్తున్నారు. షాట్ పూర్తి అయ్యింది. అంతా ఎన్టీఆర్ నటనకు చప్పట్లు కొట్టారు. కాని అదే సీన్ లో నటించిన దేవయాని మాత్రం అలాగే ఏడుస్తూ ఉంది. ఎన్టీఆర్ ఎమోషన్ తో చెప్పిన డైలాగ్స్ ఆమెకు నిజంగానే ఏడుపు వచ్చింది.

ఎన్టీఆర్ ఒక్క దేవయానినే కాకుండా విడుదల తర్వాత మరెంతో మందిని ఏడిపించడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆగస్ట్ లో ఎన్టీఆర్ అభిమానుల్ని తన నటనతో ఏడ్పించడం ఖాయమని తెలుస్తుంది.

English summary

Devayani gets tears with Ntr acting