'జనతా గ్యారేజ్' లో మహేష్‌ తల్లి!

Devayani in Ntr Janatha Garage

05:24 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Devayani in Ntr Janatha Garage

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా నటించబోయే చిత్రం 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తుంది. ఆగష్టు 12న విడుదలవుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు కి 'నాని' చిత్రంలో తల్లిగా నటించిన దేవయాని ఈ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ కి భార్యగా దేవయాని నటించబోతుందని సమాచారం. దేవయాని చాలా కాలం తరువాత తెలుగులో మళ్లీ నటించడం విశేషం.

English summary

Heroine Devayani who acted in Nani movie for Mahesh mother is acting in Young Tiger Ntr upcoming movie Janatha Garage. This movie is directing by Koratala Siva.