డిఎస్‌పి తండ్రికి శిలా విగ్రహం ఏర్పాటు..

Devi Sri Prasad father statue opening on his father birthday

03:52 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Devi Sri Prasad father statue opening on his father birthday

టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌ తండ్రి చనిపోవడం పెద్ద విషాదం. ఈ సంఘటనతో ఎప్పుడూ ఎనర్జిటిక్‌ గా ఉండే దేవీ బాగా డల్‌ అయిపోయాడు. దేవీ తన తండ్రి జ్ఞాపకార్ధంగా ఒక సాంగ్‌ ను కంపోస్ చేశాడు. దేవీ తన తమ్ముడితో కలిసి తన తండ్రి అస్తికలను గోదావరి లో కలిపేందుకు రాజమండ్రి వచ్చాడు. ఈ సందర్భంగా దేవీ మాట్లాడుతూ తన తండ్రి స్వస్థలం అయిన 'వెదురుపాక' అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన గ్రాండ్‌ పేరెంట్స్‌ జ్ఞాపకార్ధంగా 'సూర్యోదయం' అనే పేరుతో ఒక ఇల్లు నిర్మించారు అని చెప్పారు. సూర్యనారాయణ, ఉదయభాస్కరమ్ అనే పేర్లు కలిసే విధంగా సూర్యోదయం అని పేరు పెట్టారట.

మే 24 దేవీ తండ్రి పుట్టినరోజు సందర్భంగా తండ్రి విగ్రహాన్ని ఆయన స్వస్థలం వెదురుపాకలో పెడుతున్నారని చెప్పారు. తన తండ్రి అస్తికలను కృష్ణా, గంగా నదులలో కూడా కలిపారని చెప్పాడు.

English summary

Devi Sri Prasad father statue opening on his father birthday on May 24th at Vedhurupaka East Godavari Distict.