'గౌతమీ పుత్ర' కు బిగ్ షాకిచ్చిన దేవిశ్రీ

Devi Sri Prasad gave shock to Krish

11:01 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Devi Sri Prasad gave shock to Krish

అవునా నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ షాక్ ఇవ్వడం ఏమిటి అంటుకుంటున్నారా? అక్షారాలా ఇది నిజం. బాలయ్య తన 100వ చిత్రంగా ఈ చారిత్రక కథనాన్ని ఎంచుకోగా, క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు ముగించుకొని 2017 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, సంగీత కార్యక్రమాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని ఫిలింనగర్ లో మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

అయితే ఇప్పటివరకు దేవిశ్రీ గౌతమిపుత్రకు ఒక్క పాట కూడా రికార్డ్ చేయలేదని, మరోవైపు వీలైనంత త్వరగా పాటలు రికార్డ్ చేయాలని దేవిశ్రీని క్రిష్ తొందరపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు తమిళ చిత్రాలు చేస్తుండడంతో తనకు మరికొంత సమయం కావాలని దేవిశ్రీ కోరాడట. దీనికి క్రిష్ నో చెప్పడంతో, దేవిశ్రీ ఏకంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని బాలకృష్ణ, క్రిష్ భావిస్తున్నారు. మరి ఇంత తక్కువ సమయంలో మంచి పాటలు అందించగలిగే సంగీత దర్శకుడు క్రిష్ కు దొరికేనా.. కిమ్ కర్తవ్యమ్...

English summary

Devi Sri Prasad gave shock to Krish