హిరోగా దేవీశ్రీప్రసాద్‌

Devi Sri Prasad To Act As Hero

03:35 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Devi Sri Prasad To Act As Hero

సంచలన సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ సంగీతానికి టాలీవుడ్‌ నుండి బాలివుడ్‌ వరకు ఉన్నంత క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తన పాటలతో,సంగీతంతో,డ్యాన్సులతో సినీ ప్రేమికులను తన వైపు తిప్పుకున్న దేవీశ్రీప్రసాద్‌కు హీరోగా నటించమని అవకాశాలు వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తనలో హీరో లక్షణాలు ఉన్నాయని ఇప్పటికే పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు నుండి అవకాశాలు వస్తున్నాయని దేవీశ్రీ చెప్పుకొచ్చాడు. నాగచైతన్య నటించిన 100% లవ్‌ సినిమా ముందు తన దగ్గరకు వచ్చిందని, కానీ ఆ పాత్రకు తాను సరిపోనందున ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు దేవీశ్రీ చెప్పాడు.తమిళంలో జి.వి.ప్రకాష్‌ వంటి మ్యూజిక్‌ డైరెక్టర్లు హీరోగా రాణిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పుడు దేవీశ్రీప్రసాద్‌ మాటలు చూస్తుంటే తాను కూడా హీరోగా నటించడం ఖాయంగానే కనిపిస్తుంది.

English summary

Most Famous Music Director Devi Sri Prasad Says that he is likely to act in movies. He said that he was left a chance in tollywood. He says that number of top producers were asking him to act as a hero in movies