దేవీశ్రీ లో ఆ కోణం కూడా...త్వరలో వెబ్ సైట్

Devi Sri Prasad To Launch Website

03:16 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Devi Sri Prasad To Launch Website

ఉర్రూత లూగించే సంగీతంతో ప్రేక్షకుల మదిని దోచిన ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్కి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫొటోలు తీస్తుంటాడు. రాయదుర్గం లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఫోటో ఎక్స్‌పో-2016ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా తన మనోగతాన్ని విలేకరులతో పంచుకున్నాడు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే కెమెరాలను కొన్నేళ్ళుగా కొనుగోలు చేస్తూ భద్రపర్చుకుంటున్నానని చెప్పాడు. తాను తీసిన ఫొటోలన్నింటినీ ఒక చోట పెట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్రదర్శన కన్నా వెబ్‌సైట్ లాంచ్ చేసి అందులో పెట్టాలని ఉందని, త్వరలో ఈ విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:కళ్ళ ఆకారం బట్టి మీ మనస్తత్వం ఎలా ఉంటుంది

"ఎక్కడికి వెళ్ళినా రోడ్లు, ఖాళీ స్థలాలు, పార్కులు, అందమైన ప్రాంతాలు, మోడల్స్, డ్యాన్సర్స్ ఫొటోలను హబీగా తీస్తుంటా. మా తండ్రి సత్యమూర్తి మంచి ఫొటోగ్రాఫర్. తరువాత రైటర్‌గా మారారు. నాకు కారం అంటే పడదు. అందుకే మా అమ్మ నా ఒక్కడి కోసం వేరుగా వంట చేసేది. ఫొటోగ్రఫీలో కొత్త కొత్త అంశాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా విల్లార్ట్ ఎం.డీ వెంకటరమణకు ఫోన్ చేసి విసిగించి సందేహాలను తీర్చుకుంటా' అని దేవిశ్రీప్రసాద్ వివరించాడు.

"ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో పిల్లలు మ్యూజికల్ ఇన్‌స్ట్రమెంట్స్ వాయిస్తుంటే ఫొటోలు తీయాలనే కోరిక ఉందని, కొన్ని చోట్ల తీశా. మనదేశంలోని పిల్లలు డప్పు కొట్టే ఫొటోలను తీసి నా స్టూడియోలో ఒక గోడను ఖాళీగా ఉంచా. దానిపై ఈ ఫొటోలన్నింటినీ ఒకేచోట అమర్చాలని చాలా రోజులుగా ఈ కోరిక ఉంది. దీనిపై దృష్టి పెట్టా. సంగీతానికి ఫొటోగ్రఫికి చాలా అవినాభావ సంబంధం ఉంది" దేవిశ్రీప్రసాద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:తన తండ్రి గురించి నోరు జారిన జగపతి బాబు(వీడియో)

English summary

Tollywood Top Music Director Devi Sri Prasad was famous for his Superb Music and Now in an interview he said that he was going to plan to launch a new website on his photos and he also said that he likes photography along with Music.