మహిళల రక్షణకు అద్భుత పరికరం

Device That Protects Woman

07:20 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Device That Protects Woman

అమెరికాలో మహిళల ఫై అత్యాచారాలను నిరోధించడానికి ఒక పరికరాన్ని కనుగొన్నారు. అక్కడ సగటున 19.3 శాతం మహిళలు 1.7 శాతం పురుషులు అత్యాచారానికి గురవుతున్నట్టు CDC(సెంటర్స్ ఫోర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్) వారు గుర్తించారు. దీన్ని నివారించడానికి ఇండిగోగో కంపెనీ వారు సూక్ష్మముగా ఉండే చిన్న అంటినాను గుండ్రంగా ఉండే అతిచిన్న పరికరంలో అమర్చారు. ఈ చిన్న పరికరాన్ని బెల్టు లేదా మెడలో లాకెట్ లాగా అమర్చుకోవచ్చు. ఏదైనా ప్రమాదం ఎదురుపడినప్పుడు ఒక చిన్న బటన్ నొక్కిన వెంటనే పెద్దగా అలారం మోగి పరికరం లో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కు అది ధరించిన వారి యొక్క ప్రదేశాన్ని మెసేజ్ పంపుతుంది.

ఈ పరికరాన్ని అమెరికా లో అందుబాటులో తెచ్చిన 48 గంటలలోనే 1,50,310 డాలర్ల మొత్తాన్ని కంపెనీ వారు సంపాదించగలిగారు. ఈ పరికరం ప్రపంచ వ్యాప్తంగా 2016 మే మొదటి వారం నుండి అందుబాటులోకి రానుంది . దీని ధర 99 డాలర్లు ఉంటుందని తెలిపారు. దీని సృష్టికర్తల్లో ఒకరైన యస్మిన్ ముస్తఫా సౌత్ అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఒక మహిళను తీవ్రంగా కొట్టి , శారీరకంగా హింసించిన ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆపద సమయాల్లో పెప్పర్ స్ప్రే లాంటివి సమయానికి అందుబాటులో ఉండవు.. అవి విమానాశ్రయాల్లో కుడా అనుమతించరు కనుక ఇలాంటివి తేలికగా వినియోగించవచ్చని ఆమె తెలిపారు. బ్లూటూత్ సహాయంతో పని చేసే ఈ డివైస్ ను ఆడ మగ సంబంధం లేకుండా ఎవరైనా ఊపయొగించుకోవచ్చని ఆమె తెలిపారు . దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఎటువంటి భయం లేకుండా జీవించడమే అని అంటున్నారు.

English summary

Device That Protects Woman.In the United States, an estimated 19.3% of women and 1.7% of men have been raped during their lifetimes, according to the CDC.The company's first product, Athena, is a small round button that clips onto a belt or lapel. When pressed, Athena emits a loud alarm and text message the wearer's location to their emergency contacts.