ఆసుపత్రిలో దెయ్యం .. ఇదిగో రికార్డు అయింది ?(వీడియో)

Devil Spotted In A Hospital in China

11:16 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Devil Spotted In A Hospital in China

ఆ దెయ్యం లేదు, భూతం లేదు అంటుండడం తరచూ వింటుంటాం. కొందరు ఉన్నాయని వాదిస్తారు. ఏది ఏమైనా, దెయ్యాలున్నాయా, లేవా అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం సహజం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఎక్కడైనా ఇదే పరిస్థితి. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈరోజుల్లో కూడా దెయ్యాలు, భూతాల్లాంటి మూఢనమ్మకాలను నమ్మేవారు కూడా ఎక్కువగానే ఉన్నారన్నది నిజం. ఇలాంటి నమ్మకాలు కలిగిన వారిలో చైనీయులు కూడా ఉండడం విశేషం. చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో దెయ్యం ఉందంటూ ప్రచారం జరిగింది. దెయ్యం దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. ఒక మహిళా పేషెంట్ శరీరంలో నుంచి ఆత్మ వెళ్లడం తాము వీడియోలో గమనించామని, కావాలంటే మీరూ చూడండని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ వీడియోగా కొంతమంది నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి యూట్యూబ్ లో చాలానే ఉన్నాయని, దెయ్యాలనేవే లేవని కొందరు బలంగా వాదిస్తున్నారు. కొందరు మాత్రం వావ్ అంటూ ఆశ్చర్య పోతున్నారు. మీరు ఓ ఈ వీడియో పై ఓ లుక్కెయ్యండి..

ఇవి కూడా చదవండి:మరో డర్టీ పిక్చర్ లో తాప్సీ!

ఇవి కూడా చదవండి:షార్క్ చేప పొట్ట కోశాడు ... ఖంగు తినేసాడు...

English summary

A Video which was uploaded in China was trending over the internet that a Spirit arises from a dead woman body.