వంగవీటి పాటల సెన్సార్ కోరిన నెహ్రూ

Devineni Nehru Demand On Vangaveeti Movie

03:38 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Devineni Nehru Demand On Vangaveeti Movie

అవును నిజం, సంచలన దర్శకుడు వర్మ రిలీజ్ చేసిన వంగవీటి సినిమాలోని రెండు పాటలు సామాజిక వర్గాల పేర్లను ప్రస్తావిస్తూ దేవినేని నెహ్రూ ఈ సూచన చేసారు. వంగవీటి సినిమా గురించి పలువురిని కలవడానికి బెజవాడ వచ్చిన వర్మ శనివారం దేవినేని నెహ్రూతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. 1982 నుంచి జరిగిన పరిణామాల పై ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. వంగవీటి సినిమాకు అనవసర ప్రచారం కల్పించొద్దని నెహ్రూ అన్నట్టు చెబుతున్నారు. 30 ఏళ్ల కింద చిన్న గొడవ వల్ల రెండు కుటుంబాలకు నష్టం జరిగిందని కూడా ఆయన అన్నారట. గత 30 ఏళ్లుగా విజయవాడ ప్రశాంతంగా ఉందని దేవినేని నెహ్రు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వర్మకు కొత్తగా సమాచారం ఇచ్చిందేమీ లేదని నెహ్రూ చెబుతూ, వర్మకు అంతా తెలుసని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలను సెన్సార్‌ చేయాలని మాత్రమే వర్మకు సూచించాలని నెహ్రు చెప్పారు. మరి వర్మ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

English summary

Yesterday Controversial Director Ram Gopal Varma visited Vijayawada to know the details of the Vanganveeti Mohana Ranga.RGV met Devineni Nehru in Vijayawada.Devineni Nehru says that RGV knows everything about Vangaveeti Mohana Ranga and he sggested Ram Gopal Varma to sensor Vangaveeti Songs.