రాక్‌స్టార్‌గా దేవీశ్రీప్రసాద్‌!!

Devisri Prasad is acting as a hero in rockstar movie

08:04 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Devisri Prasad is acting as a hero in rockstar movie

సంగీత దర్శకుడు దేశ్రీప్రసాద్‌ హీరోగా వస్తున్నట్లు ఎన్నో ప్రచారాలు జరిగాయి. వాటన్నింటికి తెర దించుతూ నిన్న జరిగిన కార్యక్రమంలో దిల్‌రాజు నిన్న ఈ విషయాన్ని ప్రకటించాడు. దేవీశ్రీప్రసాద్‌కి ఎంతో ఇష్టమైన సుకుమార్‌ దర్వకత్వంలో ఆ చిత్రం ఉంటుందని దిల్‌రాజు తెలియజేశాడు. ఈ చిత్రానికి సుకుమార్‌-దేవీశ్రీప్రసాద్‌ స్నేహితుడు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి 'రాక్‌స్టార్‌' అని కూడా టైటిల్‌ ఖరారు చేశారు ఇంతకు మించి మరే విషయం తెలియజేయలేదు. రాక్‌స్టార్‌ అనే టైటిల్‌ దేవీశ్రీ కి కరెక్ట్‌గా సరిపోతుంది.

తన మ్యూజిక్‌, డ్యాన్స్‌తో ఎప్పుడు జోష్‌తో ఉండే దేవిశ్రీ కి ఈ టైటిల్‌ కరెక్ట్‌ యాప్ట్‌. ఈ చిత్రంలో ఒక సాధారణ యువకుడు రాక్‌స్టార్‌గా ఎలా ఎదిగాడన్న కధతో తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం త్వరలోనే తెలియజేస్తారు అని చెప్పారు.

English summary

Devisri Prasad is acting as a hero in rockstar movie which was directing by Sukumar and producing by Dil Raju.