'దేవిశ్రీప్రసాద్‌' తో డేటింగ్‌ చేస్తున్న టాప్‌ హీరోయిన్‌!

Devisri Prasad is dating with top heroine

04:54 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Devisri Prasad is dating with top heroine

'ఏం పిల్లో ఏంపిల్లడో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక 'ప్రణీత'. ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఆమెకు తెలుగులో సరైన గుర్తింపు రాలేదు. ఆ తరువాత సిద్ధార్ధ్‌ సరసన 'బావ' చిత్రంలో నటించింది. అది కూడా ఆట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఇంక కన్నడ చిత్రాల పైనే దృష్టి పెట్టింది ప్రణీత. 2013లో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంతో లైమ్‌ లైట్‌లోకి వచ్చింది ప్రణీత. ఆ తరువాత మంచు మనోజ్‌ సరసన 'పాండవులు పాండవులు తుమ్మెద' లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా మహేష్‌ సరసన 'బ్రహ్మ్మోత్సవం' చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉండగా ప్రణీత టాలీవుడ్‌లో ఒకరైన టాప్‌ మ్యూజిక్‌ డైరక్లర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలోస్తున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ ఇంతకముందు ఛార్మితో లవ్‌లో ఉన్నాడని వార్తలొచ్చాయి, అయితే మా ఇద్దరిదీ స్నేహమే అని తేల్చి పడేశారు. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్‌ ప్రణీత లవ్‌లో ఉన్నాడని, ప్రణీతని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. మరి దీని పైన ప్రణీత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

English summary

Devisri Prasad is dating with top heroine called Pranitha Subhash. She is now acting with Mahesh Babu in Brahmotsavam movie.