బుల్లితెర మీద దేవీశ్రీ మెరుపులు..

Devisriprasad giving programme in tv channel

01:43 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Devisriprasad giving programme in tv channel

సంగీతంతోనే కాకుండా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో యువతను ఉర్రూతగలిగించే సత్తాతో తెర వెనుకే కాకుండా ఆడియో ఫంక్షన్లలోనూ దేవిశ్రీ సందడి చేస్తుంటాడు. ఇక టాలీవుడ్ లో ప్రముఖ హీరోలైన చిరంజీవి 150వ చిత్రానికి, బాలకృష్ట 100వ చిత్రానికి సంగీతం అందిస్తున్న టాప్ సంగీత దర్శకుడు దేవిశ్రీ పుట్టిన రోజు నేడు. త్వరలో బుల్లితెరమీద కూడా ఈ రాక్ స్టార్ దర్శనమివ్వబోతున్నాడు. గత కొన్ని రోజులుగా దేవిశ్రీ హీరోగా సినిమా చేస్తాడని ఆశిస్తున్న ఆయన అభిమానులను ఈ వార్త కొద్దిగా నిరాశ పరిచినా, బుల్లితెర మీద దేవిశ్రీని చూడవచ్చన్న ఆనందంలో ఉన్నారట!

త్వరలో ఓ తెలుగు ఛానల్ లో దేవిశ్రీ ఓ సంగీత కార్యక్రమం చేయబోతున్నాడట! దేవిశ్రీ స్వయంగా ట్విటర్ ద్వారా తన అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. దేవిశ్రీ సంగీత కార్యక్రమం ఓ రేంజ్ లో ఉండబోతోందనేది తాజా టాక్! ఇక నుంచి బుల్లితెర మీద దర్శనమివ్వబోతున్నాడనే వార్త దేవిశ్రీ అభిమానులను భూమ్మీద నిలబడనీయడం లేదట. అంత జోష్ మీదున్నారు మరి.

English summary

Devisriprasad giving programme in tv channel