శ్రీవారికి ఐదున్నర కిలోల బంగారు హారం సమర్పణ

Devotee Donates Gold Sali Grama Haram To Lord Venkateswara

03:34 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Devotee Donates Gold Sali Grama Haram To Lord Venkateswara

తిరుమల శ్రీవారికి భువనేశ్వర్‌కు చెందిన రాజేష్‌ అనే భక్తుడు భూరీ విరాళం సమర్పించారు. రూ.2 కోట్లు విలువైన ఐదున్నర కిలోల బంగారు సాలిగ్రామ హారాన్ని అందించారు. ముందుగా స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేసిన రాజేష్ టీడీపీ ఈవో సాంబశివరావుకు ఈ హారాన్ని ఇచ్చారు.రాజేష్‌ను స్వామివారి వస్త్రంతో సత్కరించిన వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి:ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

కాగా భానుడి భగభగల దెబ్బకు తిరుమల కొండ వెలవెలబోతోంది. వేసవి సెలవులు ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా భక్తుల రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. పరీక్షా ఫలితాలు వెలువడుతున్న సమయంలో భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతూ ఉండేవి.ఈ సారి మాత్రం సూర్యుని ఎఫెక్ట్ కనబడుతోంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వేసవిలో భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. సెలవులతో పాటు వివిధ పరీక్షల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఏడాదిలో మే నెలలోనే సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఏటా ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమయ్యే భక్తుల వెల్లువ జూన్ 15వరకు కొనసాగుతుంది. దీంతో టీటీడీ కూడా వేసవి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలలో వ్యాపారులకు ఈ 50 రోజులు కీలకమైనవి. వేసవి సెలవుల్లోనే వారు కొంత సంపాదించుకుంటారు. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ మాత్రం ఊహించినంతగా లేదు. సాధారణంగా వారాంతాల్లో ఉండే భక్తుల రద్దీ కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. దీనికి ఎండలే ప్రధాన కారణం అని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. భక్తులకు ఉపసమనం కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. మాడవీధుల్లో వాటర్స్ వింక్లర్లను ఏర్పాటు చేసి నీటితో చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లో మంచినీళ్లు, మజ్జిగ సరఫరా చేస్తున్నారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఇంత తక్కువగా ఉండటం ఎప్పుడూ చూడలేదని కొంతమంది భక్తులు అంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండటం కూడా రద్దీ తగ్గడానికి మరో కారణంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. స్వామివారి దర్శనార్థం ప్రతీ ఏటా 40శాతం మంది భక్తులు తమిళనాడు నుంచి తిరుమల చేరుకుంటారు. ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఇవి కూడా చదవండి:

సెలబ్రిటీల ఎంగేజ్మెంంట్‌ రింగ్స్‌ ఇవే

దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?

పెళ్ళిలో బుగ్గచుక్క ఎందుకు పెడతారో తెలుసా ?

English summary

A Devotee From Bhuwaneshwar Donates Gold Sali Grama Haram To Lord Venkateswara.The worth of that Haram was 2 Crores and it was weighed up to 5 Lakhs.