అమావాస్య పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు

Devotees At New Moon Bath

11:21 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Devotees At New Moon Bath

పుష్య మాస ముగింపు, మాఘ మాస ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య సందర్భంగా ఓ పక్క సముద్ర స్నానాలు , మరో పక్క నదీ సంగమ సాగర స్నానాలకు భక్తులు పోటెత్తారు. తెల్ల్లవారుఝాము నుంచే స్నానాలు చేసే భక్తులతో సందడి నెలకొంది. గోదావరి జిల్లాల్లో ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య గా వ్యవహరిస్తారు. తూర్పు గోదావరి కాకినాడ దగ్గర చొల్లంగి లో సముద్ర స్నానాలు జోరుగా సాగుతున్నాయి.

ఇక శ్రీకాకుళం జిల్లాలో నదీ సాగర సంగమ ప్రాంతాల్లో మహోదయ ఘడియలు ప్రారంభమయ్యాయి. బారువ తీరంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌, ఆర్డీవో వెంకటేశ్వరరావు హారతితో పుణ్యస్నానాలు ప్రారంభించారు. ఈ తీరానికి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటీపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రాంతాల నుంచి ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వంశధార నదీ సాగర సంగమ ప్రాంతమైన కళింగపట్నంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఈ పుణ్యస్నానాలను ప్రారంభించారు. అమావాస్య కారణంగా సముద్ర పోటు అధికంగా ఉండటంతో ఆదివారం రాత్రి స్నానాలు చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమావాస్య ఘడియలు ఉండటంతో పాటు శ్రవణా నక్షత్రం కలిసి వస్తే అదే మహోదయ పుణ్యకాలమని పండితులు అన్తున్నారు. అందుచేత భక్తులు ఈరోజంతా పుణ్యస్నానాలు చేయొచ్చని చెబుతున్నారు.

అరుదుగా సంభవించే ఈ పుణ్యకాలం 33 సంవత్సరాల తర్వాత వచ్చింది. మహేంద్రగిరులపై పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మహోదయం రోజు నిర్వహించాలని పురాణ ప్రశస్తి. కాగా గుప్తకాశీగా గుర్తింపు పొందిన బారువ తీరంలో మహేంద్ర తనయ నదీ సాగర సంగమ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటివరకు అర్దోదయ, సాధారణ మహోదయం లాంటి పుణ్యకాలాలే సంభవించాయి. ద్వాపర యుగంలో ఇలాంటి అరుదైన పుణ్యకాలంలోనే మహోదయం సంభవించింది. ఆదివారం రాత్రి 10.19 గంటలకు మహోదయ పుణ్యకాలం ప్రారంభమైందని పండితుల చెబుతున్నారు.

English summary

Devotees went for a traditional bath in All Coast Areas In Andhra Pradesh.Many of the devotes were started holy bath from the early morning