కాల్ మనీలో ఎవరినీ వదిలేది లేదన్న డిజిపి 

DGP Says That They Wont Leave Anyone in Call Money Case

05:57 PM ON 15th December, 2015 By Mirchi Vilas

DGP Says That They Wont Leave Anyone in Call Money Case

కాల్ మనీ వ్యవహారంలో ఎవరినీ వదిలేది లేదని ఎపి డిజిపి జెవి రాముడు చెప్పారు. కాల్ మనీ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. కొన్ని జిల్లాల్లో కాల్ మనీ మాఫీయా ఎక్కువగా వుందని ఆయన అంచనా వేసారు,కాగా విజయవాడ సిపి గౌతం సవాంగ్ సాధారణ సెలవులో వెలుతున్నారని , ముందుగానే ఆయన అనుమతి కోరారారని డిజిపి చెబుతూ , నెలరోజులక్రితమే సెలవు మంజూరైందని ఆయన చెప్పారు.

ఇక కాల్ మనీ వ్యవహారంలో ఎపిలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు మొదలవడంతో ఎక్కడికక్కడ గప్ చిప్ గా మారింది. విజయవాడలో టిడిపి ఎం ఎల్ సి బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వర రావు ను అరెస్టు చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి భారీగా పత్రాలు , స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.

మరో పక్క కల్తీ మద్యం కేసులో వున్న మల్లాది విష్ణు అనుచరుల ఇళ్ళ పై కూడా దాడులు సాగిస్తున్నారు. విక్కీ అనే వ్యక్తిని అదుపులో తీసుకుని , ప్రాం సరి నోట్లు , పత్రాలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

కాల్ మనీ కేసులు ఆయా జిల్లాల్లో కూడా నమోదవుతున్నాయి. విశాఖలో ఫైనాన్షియర్ రామకృష్ణపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి తదితర చోట్ల కాల్ మనీ నిర్వాహకుల పై దాడులు సాగించి , కొనదరిని అదుపులోకి తీసుకున్నారు. విలువైన పత్రాలను కొందరు నీళ్ళల్లో పారేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు బడా బాబులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూడా కాల్ మనీ దందా పై సోదాలు జరుగుతున్నాయి.

English summary

DGP of Andhra Pradesh J.V.Ramudu says that they wont leave anyone who were involved in Call Money Case