రజినీ కూతురు వ్యభిచారిగా ఎందుకైనట్టు?

Dhansika is acting as a prostitute

12:00 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Dhansika is acting as a prostitute

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి. ఇందులో రజినీకాంత్ కి కూతురుగా ధన్సిక నటిస్తుంది. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ధన్సిక రజినీకాంత్ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం విడుదల కాకుండానే ధన్సికాకి అప్పుడే వరుస అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ధన్సిక మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆనంద్ మూర్తి అనే డైరెక్టర్ తెరకెక్కించబోయే చిత్రంలో ధన్సిక నటించబోతుంది. ఇందులో ధన్సిక ఒక వ్యభిచారిగా నటిస్తుంది. ఆనంద్ మూర్తి చెప్పిన కధ అద్భుతంగా ఉండడంతో ఈ కధని వదులుకోకూడదని ధన్సిక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇందులో ధన్సికాని ఎప్పుడూ చూడని విధంగా మరింత హాట్ గా కనిపిస్తుందట. కొలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇందులో మరో స్టార్ హీరోయిన్ బిదిత బాగ్ కూడా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ వారంలో మొదలు కానుంది.

English summary

Dhansika is acting as a prostitute