'నవమన్మధుడు' గా ధనుష్‌!!

Dhanush as Navamanmadhudu

10:44 AM ON 9th December, 2015 By Mirchi Vilas

Dhanush as Navamanmadhudu

'కొలవరి డి' పాటతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న నటుడు ధనుష్‌. '3' చిత్రంలో ధనుష్ పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ హిట్తైంది. ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆ తరువాత రఘువరన్‌ బి.టెక్‌ చిత్రంతో మన ముందుకు వచ్చాడు ధనుష్‌. ఇది తెలుగు, తమిళం లోనూ సూపర్‌ హిట్‌. ఈ ఏడాది ధనుష్‌ నటించిన చిత్రం 'అనేకుడు' (అనేగన్‌ తమిళం) విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం 'తంగ మగన్‌' తెలుగులో 'నవమన్మధుడు' పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్‌ కధానాయకులుగా నటిస్తున్నారు.

రఘువరన్‌ బి.టెక్‌ (వేలై ఇల్లాద పట్టదారి తమిళంలో) చిత్రాన్ని తెరకెక్కించిన వేల్‌రాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం డి. ప్రతాప్‌ రాజు సమర్పణలో బృందావన్‌ పిక్చర్స్‌ పతాకం పై తెలుగులో విడుదల చేస్తుండగా ఎన్‌.వెంకటేష్‌, ఎన్‌.రవికాంత్‌లు నిర్మించారు. సెన్సార్‌తో సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌ 11న విడుదల చేస్తున్నారు. అలాగే డిసెంబర్‌ 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చుయబోతున్నారు.

English summary

Dhanush is acting in Nava Manmadhudu. It is dubbing tamil movie called Thanga Magan. Samantha and Amy Jackson was heroines.