హాలీవుడ్‌ లో 'ధనుష్‌' ఎంట్రీ!!

Dhanush in Hollywood entry

10:51 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Dhanush in Hollywood entry

తమిళ స్టార్‌హీరో ధనుష్‌ కోలీవుడ్‌ లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో కూడా మంచి పేరు సంపాదించాడు. అయితే ఇప్పుడు ధనుష్‌ హాలీవుడ్‌ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ధనుష్‌ హాలీవుడ్‌ రంగప్రవేశం గురించి దాదాపు ఏడాది నుండి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చి ధనుష్‌ హాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ ఉమా తుర్మన్‌ తో ధనుష్‌ జతకట్టనున్నాడు. ఈ సినిమా 'ద ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్ హూ గాట్ ట్ర్యాప్డ్ ఇన్ ఏన్ ఇకియా వార్డ్‌రోబ్' అనే టైటిల్‌ తో తెరకెక్కనుంది.

ప్రముఖ ఇరానియన్‌-ఫ్రెంచ్‌ ఫిలిం డైరెక్టర్‌ మర్జాన్‌ సత్రాపి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో ధనుష్‌ నటించిన 'మరియన్‌' చిత్రంలో ధనుష్‌ పెర్ఫార్మెన్స్‌ బాగా నచ్చి ఈ హాలీవుడ్‌ సినిమాకి ధనుష్‌ ని ఎంపిక చేశారని సమాచారం. సూపర్‌స్టార్‌ రజనీ పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికవ్వడం, ధనుష్‌ హాలీవుడ్‌ సినిమా గురించి ప్రకటించడం ఒకే రోజు జరగడంతో సూపర్‌స్టార్‌ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నారు.

English summary

Dhanush is giving Hollywood entry in the movie 'The Extraordinary Journey of the Fakir Who Got Trapped in an Ikea Wardrobe'. Hollywood star heroine Uma Thurman is romancing with Dhanush in this film.