నారదుడుగా ధనుష్

Dhanush New Film Named Naradudu

10:23 AM ON 28th May, 2016 By Mirchi Vilas

Dhanush New Film Named Naradudu

అవునా, నిజమే కానీ పౌరాణిక నారదుడు కాదు.. సోషల్ సినిమాయే ... ధనుష్, జెనీలియా జంటగా జవహర్ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రం నారదుడు టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకిరానుంది. శ్రియ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉమా తెలుగులోకి అనువదిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ధనుష్ హీరోగా తమిళంలో విజయవంతమైన చిత్రమిది. కమర్షియల్ హంగులతో నేటివిటీ పరంగా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ధనుశ్, జెనీలియా, శ్రియ మధ్య సన్నివేశాలు, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు, విజయ్ ఆంటోని సంగీతం, భువనచంద్ర పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జూన్ లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అని వివరించాడు.

ఇవి కూడా చదవండి:చిరంజీవి 150వ సినిమాలో ఇప్పుడు ఐతే చెయ్యలేనన్న సునీల్!

ఇవి కూడా చదవండి:సెక్సీగా ఉందంటూ సొంత దేశంలోనే ఆమె యాడ్ బ్యాన్(వీడియో)

English summary

Tamil Hero Dhanush was going to entertain Telugu audience with his new movie. Dhanush's Tamil Movie Was going to release in Telugu with the name of "Naradudu" . Genilia and Shreya were acted as heroines in this movie.