'ధనుష్‌-సమంత' మూడోసారి.....

Dhanush-Samantha pairing again third time

01:28 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Dhanush-Samantha pairing again third time

ధనుష్‌ నటించిన తాజా చిత్రం 'నవమన్మథుడు' (తంగమగన్‌ తమిళం) సమంత, అమీజాక్సన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 'రఘవరన్‌ బి.టెక్‌' ఫేమ్‌ వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్‌ 18) విడుదల అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ధనుష్‌ నటించబోయే 'వాడ చెన్నై' చిత్రంలో కూడా సమంతానే హీరోయిన్‌గా నటించబోతుంది. ఈ చిత్రానికి వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇది కాకుండానే ధనుష్‌-సమంత మూడోసారి కూడా జత కట్టనున్నారు. సెల్వారాఘవన్‌ దర్శకత్వం వహించబోతున్న ధనుష్‌ చిత్రంలో కూడా సమంతానే ఎంపిక చేసుకున్నారు.

అంటే నవమన్మథుడుతో మొత్తం ధనుష్‌-సమంత మూడా సార్లు జత కడుతున్నారు.

English summary

Dhanush-Samantha pairing again third time in upcoming movie.