మెగా ఫ్యామిలీ హీరోకి పాట పాడిన ధనుష్

Dhanush sung a song for Thikka movie

11:46 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Dhanush sung a song for Thikka movie

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తిక్క'. ఈ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకు రావడానికి ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ శ్రీకారం చుట్టాడు. థమన్ అండతో ఈ సినిమాకు తాజాగా ఓ ప్రత్యేకత వచ్చి చేరింది. అదేమిటంటే... తమిళ సూపర్ స్టార్ ధనుష్ చేత ఈ సినిమాలో ఓ పాట పాడించడం. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో ధనుష్ పాడిన పాట మేజర్ హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ధనుష్-థమన్ కలిసి ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. గతంలో తాను హీరోగా నటించిన సినిమాల్లో పాటలు పాడిన ధనుష్, ఇలా ఓ తెలుగు హీరో కోసం ప్రత్యేకంగా పాట పాడడం తొలిసారి.

ముఖ్యంగా అప్పట్లో ధనుష్ పాడిన 'కోలవెరి డి' అనే పాట పెద్ద సంచలనమే సృష్టించింది. మరి ఈ పాట ఏ రేంజి సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక 'తిక్క' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన లరిస్సా బోన్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు. డాక్టర్ సి. రోహిన్ రెడ్డి నిర్మాత. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లడక్ లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఆడియోను ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 13న విడుదల చేయడానికి నిర్మాత డాక్టర్ సి.రోహిణ్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత డాక్టర్ సి.రోహిణ్ రెడ్డి అన్నారు.

English summary

Dhanush sung a song for Thikka movie