ఒక మనసు పై మోజు పడ్డ ధనుష్

Dhanush To Remake Oka Manasu Movie

10:41 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Dhanush To Remake Oka Manasu Movie

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒక మనసు కి భలే టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. దీంతో కోలీవుడ్ స్టార్ ధనుష్ దృష్టి ఈ సినిమాపై పడిందని, స్పెషల్ స్క్రీనింగ్ చూశాడని అంటున్నారు. అన్నీ నచ్చితే దీన్ని ఈ హీరో తమిళంలో రీ-మేక్ చేయవచ్చునని, ఇందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ధనుష్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆయన ఒక మనసు చిత్రం చూశాడంటే ఏదో విశేషం ఉండబట్టే కదా అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా దీనిపై అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది. తన సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యాన ధనుష్ ఇందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని ఇన్ సైడ్ టాక్...నాగశౌర్య పాత్రలో ధనుష్ నటించనున్నాడని రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి:బికినీలో హీటెక్కిస్తున్న తేజస్వి మడివాడ
ఇవి కూడా చదవండి:శ్రియ అందరినీ ఇష్టపడిందట.. కానీ పెళ్లి మాత్రం...

English summary

Kollywood hero Dhanush has seen the movie of "Oka Manasu" in which Mega Daughter Niharika and Young Hero Naga Showrya were acted as hero heroines in the movie and now dhanush saw the special show and he was planning to this movie in Kollywood.