ఒకప్పుడు అది అందమైన పట్టణం... ఇప్పుడది దెయ్యాల నగరం...

Dhanushkodi in Tamil Nadu

05:11 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Dhanushkodi in Tamil Nadu

చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు ఉంటాయి. చారిత్రిక పట్టణాలు కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఆనవాళ్లు కూడా లేవు. కొన్ని ఆనవాళ్లు వున్నా ఆనాటి వైభవం లేదు. ఇక కొన్ని చోట్ల దెయ్యాలు, భూతాలతో నిశ్శబ్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. అలాంటి పట్టణమే ఇది. ఒకప్పుడు అందాల పట్టణంగా భాసిల్లింది. ఆహ్లాదం.. ఆధ్యాత్మికం దాని సొంతం. దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు అక్కడికి వచ్చిపోయేవారు. అయితే ప్రకృతి ఆడిన వికృత నాటకానికి ఆ పట్టణం సజీవ సాక్ష్యం అయింది. అందుకే సర్వం కోల్పోయి నిశ్శబ్ధ పట్టణంగా మారిపోయింది. అక్కడ ఇప్పుడు దెయ్యాలు సంచరిస్తున్నాయట. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

తమిళనాడులోని ధనుష్కోడి... భారతదేశానికి దక్షిణ సరిహద్దు ప్రాంతంలో చిట్టచివరి పట్టణం ఇదే. అక్కడికి శ్రీలంక కేవలం 18 మైళ్ల దూరమే. ఓ స్టీమర్ నిత్యం భారత్, శ్రీలంక మధ్య సరకులు, ప్రజలను రవాణా చేస్తుండేది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతున్న వారి జీవితాల్లో 1964 డిసెంబర్ 22 ఓ చీకటి రాత్రిగా మిగిలిపోయింది. తూఫాన్ విశ్వరూపం దాల్చి ఆ పట్టణాన్ని పూర్తిగా దెబ్బతీసేసింది. ఈ హఠాత్పరిణామానికి గురై ఆ సమయంలో పాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న 100 మంది ప్రయాణీకులు గంగపాలయ్యారు.

మరెంతో మంది సర్వం కోల్పోయారు. పెద్దపెద్ద భవనాలు, ఆస్పత్రులు, చెట్లు నేల మట్టమయ్యాయి. ఆ పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. ఇక ఇప్పటికీ చీకటి పడితే, అటువైపు వెళ్లడానికి జనం భయపడుతున్నారు. అందుకే తమిళనాడు ప్రభుత్వం దానిని దెయ్యాల పట్టణంగా పేర్కొంది. చీకటి వేళల్లో అటువైపు ఎవ్వరినీ అనుమతించరు.

English summary

Dhanushkodi in Tamil Nadu.