మహేష్ కి తల్లిగా నటిస్తున్న ఈమె ఎవరో తెలుసా?

Dheepa Ramanujam is acting as a Mahesh Babu mother in Murugadoss movie

01:26 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Dheepa Ramanujam is acting as a Mahesh Babu mother in Murugadoss movie

అవునా ఇదేమిటి అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసి, సంచలనం రేపిన బిచ్చగాడు మూవీ ఇంకా కలెక్షన్స్ లో దూసుకెళుతోంది. ఇక ఈ మూవీతో నటి దీపా రామానుజం లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తన నటనతో ఇటు తమిళం.. అటు తెలుగు ప్రేక్షకులకు దీపా దగ్గరైంది. లేటెస్ట్ గా ఈమెని సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూప్రాజెక్ట్ లో తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రిన్స్ మదర్ గా ఎవరైనా బాగుంటుందన్న దానిపై మురుగదాస్ సెర్చింగ్ మొదలుపెట్టాడు. కొంతమంది పేర్లు పరిశీలించినప్పటికీ ఫైనల్ గా బిచ్చగాడుతో ఆడియన్స్ కు దగ్గరైన దీపా రామానుజం అయితే బాగుంటుందని భావించి ఓకే చేసినట్టు కోలీవుడ్ వర్గాల కధనం.

కాగా ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఫస్ట్ షెడ్యూల్ కి ఈమె హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత దీపా తెలుగులోనూ బిజీ అయ్యే ఛాన్స్ వుందని సినీ లవర్స్ చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు-మురుగదాస్ ప్రాజెక్ట్ ఈనెల 29న లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చెన్నై, ముంబై, పూనే, గుజరాత్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని షూట్ చేయబోతున్నారు.

English summary

Dheepa Ramanujam is acting as a Mahesh Babu mother in Murugadoss movie