గ్రౌండ్ లో ధోనికి తృతిలో తప్పిన ప్రమాదం!

Dhoni escaped from accident

06:52 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Dhoni escaped from accident

ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పెను ప్రమాదం తృతిలో తప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..జింబాబ్వే పర్యటనలో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెద్ద ప్రమాదం తప్పింది. హరారే వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 17వ ఓవర్ వేసిన జింబాబ్వే బౌలర్ డొనాల్డ్ తిరిపానో బౌలింగ్ లో ధోని భారీ షాట్ కి యత్నించగా.. బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. అయితే బంతి వికెట్లను తాకగానే వికెట్లపై ఉన్న బెయిల్స్ లో ఒకటి గాల్లోకి ఎగురుతూ వచ్చి క్రీజులో ఉన్న ధోని కంటికి సమీపంలో తాకింది.

దీంతో కాసేపు నొప్పితో అలానే క్రీజులో నిల్చొన్న ధోనీ అనంతరం పెవిలియన్ వైపు నడిచాడు. వేగంగా హెల్మెట్ లోపలికి చొచ్చుకొచ్చిన బెయిల్ ధోని కంటిని తాకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం 13 బంతులాడిన ధోని ఒక ఫోర్ కొట్టి 9 పరుగులే చేయగలిగాడు.

English summary

Dhoni escaped from accident