ధోని పై బాంబు పేల్చిన రాంచీ డీటీఓ

Dhoni is not paying tax for hummer car

06:58 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Dhoni is not paying tax for hummer car

పనిలో పడడం వలనో, ఆటలో బిజీ వలనో తెలీదు గానీ పరుగుల కింగ్, కెప్టెన్ ధోని చేయాల్సిన పని చేయక పోవడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. అదేనండీ ధోనీకి మరో సమస్య ఎదురైంది. తన కారుకు ధోని ఐదేళ్లుగా పన్ను కట్టడంలేదని రాంచీ డీటీఓ బాంబు పేల్చాడు. ఈ ఘటనలో కధాకమామిషు ఏమంటే, ధోని హమ్మర్ వాహనం కొనుగోలు చేసాడు. ఇది అంతర్జాతీయ బ్రాండ్. అయితే ఆ విషయం టైపిస్ట్‌కు తెలియకపోవడంతో ధోని హమ్మర్ కారు పేరును పొరపాటున స్కార్పియో వాహనంగా రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసాడు. ఫలితంగా ధోని హమ్మర్ వాహనం వివరాలు తమ వద్దని లేవని డీటీఓ చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ధోని కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే పన్ను చెల్లించారని.. గత ఐదేళ్లుగా పన్ను చెల్లిచండం లేదని.. కాబట్టి ఇప్పుడు జరిమానాతో సహా ఒకేసారి దోని పన్ను చెల్లించాల్సి ఉంటుందని డీటీఓ వివరించారు.

English summary

Indian Cricket team captain Mahendra Singh Dhoni is not paying tax for hummer car.