రిటైర్మెంట్ ఎప్పుడూ అని అడిగిన జర్నలిస్ట్ ని ఆడుకున్న ధోని

Dhoni plays with reporter for asking him about retirement

04:09 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Dhoni plays with reporter for asking him about retirement

క్రికెట్ ఆటగాడు జర్నలిస్ట్ ని ఆడుకోవడమేమిటని అనుకుంటున్నారా? నిజం ... మరి అతను వేసిన ప్రశ్నకు తనదైన స్టైల్లో ధోని బదులిచ్చాడు మరి. వివరాల్లోకి వెళ్తే, సెమీస్ లో ఓడిపోయాక, ఓ జర్నలిస్ట్ తన దగ్గరకు రావడం గమనించిన ధోని, మహా అయితే రిటైర్మెంట్ ఎప్పుడని అడుగుతాడేమో అనుకుంటూ, ఓ వేళ అలా అడిగితే ఏం సమాధానం చెప్పాలో ముందే ప్రిపేర్ అయిపోయాడు ధోని... అనుకున్నట్టే ఆ జర్నలిస్ట్ ధోనిని రిటైర్మెంట్ గురించి క్వశ్చన్ అడిగాడు. దీంతో, నువ్వు ఇండియన్ రిపోర్టర్ వి కాదు, ఒకవేళ ఇండియన్ రిపోర్టర్ అయితే వేరే విధంగా క్వశ్చన్ అడిగేవాడు అన్నాడట ధోని.

అంతేకాదు... సదరు రిపోర్టర్ కి పక్కనే చైర్ వేసి కూర్చోబెట్టి మరీ 'నేను బానే ఆడుతున్నా కదా, వికెట్ల మధ్య పరుగెడుతున్నా, కీపింగ్ కూడా బానే చేస్తున్నా, అలాంటప్పుడు వీడ్కోలు అవసరమా?' అని అడిగేసరికి ఆ రిపోర్టర్ ఖంగు తిన్నాడట. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అంటూ ఆ రిపోర్టర్ ని పంపించేసాడట ధోని... దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం నవ్వులతో నిండిపోయిందట. ఎంతైనా ధోని స్టైల్ వేరబ్బా అంటారు అందుకే...


English summary

Dhoni plays with reporter for asking him about retirement. A foreign reporter asked Dhoni about his retirement and Dhoni gave reply in his style.