దుబాయి సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దోనీ

Dhoni selected as brand ambassador for Dubai based company

03:14 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Dhoni  selected as brand ambassador for Dubai based company

భారత్‌క్రికెట్‌ జట్టు సారధి దోనీను దుబాయ్‌కు చెందిన ఒక హోటల్‌ పరిశ్రమకు చెందిన బ్రాండ్‌ మిడ్‌వెస్ట్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మూడేళ్ళపాటు నియమించుకుంది. దోనీను తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో విడుదల చేసిందట. దుబాయిలోని ఒక క్రికెట్‌ టీమ్‌ను ఇప్పటికే కలిగిన సదరు సంస్థ ఇండియాలో కూడా తన కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సిధ్ధంగా ఉంది. దీనిలో భాగంగానే దోనీని కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంపెనీ నియమించింది. మాస్టర్స్‌ చాంపియన్స్‌ లీగ్‌ పేరిట ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ఈ సంస్థకుచెందిన జిఎం స్పోర్ట్స్‌ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

భారత వ్యాపార రంగంలో ఎన్నో ప్రముఖ కంపెనీలకు ప్రచార కర్తగా ఉన్న దోనీ ఇప్పుడు ఈ డీల్‌తో భారత్‌ ఆవల ఒక అంతర్జాతీయ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులవ్వడం విశేషం.

English summary

Indian One Day,T20 cricket team captain deals with another company.He is appoionted as a brand ambassador for UAE based company Grand Midwest Group.