చెర్రీ 'ధ్రువా'ల మధ్య సయోధ్య లేదా?

Dhruva movie release date was postponed

11:52 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Dhruva movie release date was postponed

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ ప్రోజెక్ట్ 'ధ్రువ' మూవీ రిలీజ్ డేట్ మారినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ పక్కన రకుల్ హీరోయిన్. తొలుత సెప్టెంబర్ 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 7కి మార్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అంటే దసరాకు రెండురోజుల ముందు రిలీజ్ చేస్తారట. అంటే ఫస్ట్ డేతోపాటు వీకెండ్ కూడా కలెక్షన్స్ టార్గెట్ చేసినట్టుగా చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ లేకపోలేదు. షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ కావడంతో రిలీజ్ అక్టోబర్ కి షిఫ్ట్ చేసినట్టు చెబుతున్నారు.

మరికొందరైతే డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అనుకున్న టైమ్ కి ఏ మూవీ రాలేదని, ధ్రువ కూడా అంతేనని అంటున్నారు. ఇంకొందరైతే కొన్ని సన్నివేశాల విషయంలో డైరెక్టర్- ప్రొడ్యూసర్ విభేదాలు పొడచూపాయనే మాట వినిపిస్తోంది. అసలు ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే యూనిట్ అఫీషియల్ గా డేట్ రిలీజ్ చేసేవరకు ఆగాల్సిందేనని అంటున్నారు.

English summary

Dhruva movie release date was postponed