ఏపీలో బయట పడ్డ వజ్రాల నిధి!

Diamond mine in Andhra Pradesh

03:50 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Diamond mine in Andhra Pradesh

అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గని ఉందని పరిశోధకులు తెలిపారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలున్నట్టు కనుగొన్నారు. దీంతో నమూనాల సేకరణకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అడ్వయిజరీ కమిటీ గొట్టపు బావుల తవ్వకాలకు అనుమతులిచ్చింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలోని పిల్లలపల్లి అటవీ ప్రాంతంలో 153 హెక్టార్లలో ఈ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. అందులో 64 గొట్టపుబావుల తవ్వకానికి కేంద్రం అనుమతిచ్చింది. నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతంలో ఇప్పటికీ వర్షాలు కురిసిన ప్రతిసారీ వజ్రాల వేట సాగుతూనే ఉంది. ఇరుగుపొరుగు రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వజ్రకరూరు పొలాల బాట పడతారు. ఈ అన్వేషణలో ఏటా ఒకరిద్దరికీ వజ్రాలు దొరుకుతున్నట్టు స్థానికుల సమాచారం. ఈ విషయంలో అదును కోసం కాచుకుని ఉన్న వజ్రాల వ్యాపారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా కొని సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వజ్రకరూరులో ప్రత్యక్షంగా భూముల్లో వజ్రాలు దొరుకుతుండడం, తాజాగా కళ్యాణదుర్గం అడవుల్లో ఆ నిక్షేపాలున్నట్టు కనుగొనడం చూస్తే అనంతపురం జిల్లాలో వజ్రాల గనులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి: ముందు పర్స్ కొట్టేసాడు.. తరువాత సీసీ కెమెరా ఉందని తెలిసి..(వీడియో)

ఇది కూడా చదవండి: సైనికుల నుంచి మనం తెలుసుకోవాల్సిన చిట్కాలు

ఇది కూడా చదవండి: ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో తెలుసా?

English summary

Diamond mine in Andhra Pradesh. Diamond Mine found at Pillalapalli forest area. And government ready to take that diamond mine.