4లక్షలు దాటిన  'డికాప్రియో' ట్వీట్లు

DiCaprio New Record In Twitter

10:03 AM ON 1st March, 2016 By Mirchi Vilas

DiCaprio New Record In Twitter

ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను అందుకున్న హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో ట్విట్టర్లో రికార్డు సృష్టించాడు. డాల్బీ థియేటర్‌లో 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ‘ద రివెనంట్‌’ చిత్రం ద్వారా ఉత్తమ కథానాయకుడిగా ఎంపికైన డికాప్రియోకి అభిమానులు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ద్వారా అభినందనలు తెలిపారు. డికాప్రియోకి శుభాకాంక్షలు తెలుపుతూ నిమిషానికి 4,40,000 ట్వీట్లు వచ్చినట్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్లీ వెల్లడించింది. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘స్పాట్‌లైట్‌’ చిత్రం అత్యధిక ట్వీట్లు సాధించిన దాంట్లో రెండో స్థానంలో నిలిచింది. కాగా 2014లో జరిగిన ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎల్లెన్‌ డిజెరస్‌ అవార్డుకి హాజరైన వారందరితో కలిసి తీసుకున్న సెల్ఫీను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తే, నిమిషానికి 2,55,000 ట్వీట్లు వచ్చాయి. మరి ఆ రికార్డుని భారీగానే డికాప్రియో అధిగమించాడు.

English summary