మూడు భాషల్లో 'డిక్టేటర్‌'!!

Dictator in 3 languages

11:59 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Dictator in 3 languages

నందమూరి బాలకృష్ణ నటించిన 99వ చిత్రం 'డిక్టేటర్‌'. లౌక్యం ఫేమ్‌ శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్లుగా నటించారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పుటికే విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా జనవకి 14న విడుదలవుతున్న డిక్టేటర్ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం లో కూడా విడుదలవుతుంది. బాలయ్య సినిమా తెలుగులో కాకుండా ఇలా ఇతర భాషల్లో కూడా విడుదలవడం ఇదే మొదటిసారి. ఈ చిత్రాన్ని ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్ధ, శ్రీవాస్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రం విజయం పై కచ్చితమైన నమ్మకం ఉన్న ఎరోస్‌ సంస్ధ ఇలా మూడు భాషల్లో విడుదల చేసి క్యాష్‌ చేసుకోవాలనుకున్నారు, అందుకే ఇలా మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న డిక్టేటర్‌ చిత్రం నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్‌ప్రెస్‌రాజా, కథకళి చిత్రాలతో తలపడనుంది.

English summary

BalaKrishna's Dictator movie is releasing in Telugu, Tamil and Malayalam languages