క్రేజీ ప్రొడ్యూసర్‌ చేతిలో 'డిక్టేటర్‌' నైజాం రైట్స్‌!!

Dictator movie Nizam rights in crazy producer hand

04:28 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Dictator movie Nizam rights in crazy producer hand

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్‌'. లౌక్యం ఫేమ్‌ శ్రీవాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహాన్, అక్ష కధానాయికలుగా నటిస్తున్నారు. ఘాటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న డిక్టేటర్‌ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. జనవరి 14న విడుదలవబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్‌ కూడా అప్పుడే మొదలైపోయింది. క్రేజీ ప్రొడ్యూసర్‌ మరియు ప్రొడ్యూసర్‌ 'దిల్‌ రాజు' డిక్టేటర్‌ చిత్రం నైజాం రైట్స్‌ని చేజిక్కించుకున్నాడు. అంతే కాదు 'డిక్టేటర్‌' ని నైజాంలో అంగరంగ వైభవంగా విడుదల చెయ్యడానికి మంచి ధియేటర్లను కూడా ఎంపిక చేసుకుంటున్నాడు.

దిల్‌ రాజు ఏ సినిమా తీసుకున్న అది దాదాపు సూపర్‌హిట్‌ అని భావిస్తారు. ఇప్పుడు డిక్టేటర్‌ నైజాం రైట్స్‌ని దిల్‌రాజు ఎక్కువ మొత్తం పెట్టి కొనడం వలన డిక్టేటర్‌ కచ్చితంగా సూపర్‌ హిట్టే అని బాలకృష్ణ అభిమానులు ఆనందంగా ఉన్నారు.

English summary

Dictator movie Nizam rights bought by producer and distributor Dil Raju.