హిందీలో బాలయ్య డిక్టేటర్!!

Dictator movie want to remake in hindi by Bollywood producers

12:03 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Dictator movie want to remake in hindi by Bollywood producers

నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్‌'. మంచి మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'లౌక్యం' ఫేమ్‌ శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే ఢిల్లీలో పూర్తి చేసుకుని హైదరాబాద్‌ తిరిగి వచ్చింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్ధ దర్శకుడు శ్రీవాస్‌ని కలిసి మంతనాలు జరిపింది. శ్రీవాస్‌ వాళ్లకి డిక్టేటర్‌ కథ చెప్పగా ఆ కథ విన్న నిర్మాణ సంస్ధ సూపర్బ్ అని కూడా కితాబు ఇచ్చింది.

అంతే కాదు మా సంస్ధతో ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించమని శ్రీవాస్‌ని కోరిందట. ఈ హిందీ సినిమాలో అజయ్‌ దేవగన్‌ అయితే బాగుంటాడని అతనితో చర్చలు కూడా జరుపుతుందట. ఒకవేళ అజయ్‌ దేవగన్‌ ఓకే చెపితే శ్రీవాస్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టినట్టే. మరి ఈ సినిమా ఎంత హిట్‌ అవుతుందో తెలియాలి ఆంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

English summary

Dictator movie want to remake in hindi by Bollywood producers with Ajay Devgan.