యూట్యూబ్ లో 'డిక్టేటర్‌' పైరసీ!!

Dictator piracy in youtube

02:00 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Dictator piracy in youtube

నందమూరి బాలకృష్ణ హీరోగా సంక్రాంతికి విడుదల చేసిన సినిమా డిక్టేటర్‌. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించి లాభాల బాటలో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా పూర్తి పైరసీ ప్రింట్‌ను ఒక ప్రముఖ టి.వి. చ్యానెల్ యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మొత్తం పైరసీ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటనతో వారు మరింత షాక్‌ అయ్యారు. ఇప్పటివరకూ ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తీసెయ్యలేదు. ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసినట్లు చ్యానెల్ యాజమాన్యం ఇంకా గుర్తించకపోయి ఉండొచ్చు. బహుశా ఈ చ్యానెల్ లో పనిచేసే వ్యక్తే ఈ సంఘటనకు పాల్పడి ఉండాలి.

లేదా ఈ చ్యానెల్ అఫీషియల్ యుట్యూబ్‌ ను హ్యాక్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కారణం ఏదయినప్పటికీ నష్టపోయేది మాత్రం చిత్ర నిర్మాతలే.

English summary

Nandamuri Balakrishna 99th movie Dictator movie piracy was released by some famous tv channel in youtube. This movie is directed by Srivaas.