ఒకరోజు ముందే 'డిక్టేటర్‌' ప్రీమియర్‌ షో

Dictator premiere show is one day before

03:39 PM ON 10th January, 2016 By Mirchi Vilas

Dictator premiere show is one day before

నందమూరి బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్‌'. ఈ సినిమా ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుని జనవరి 14న విడుదలకు సిద్ధమౌతుంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ కొంత మంది కార్పొరేట్ దిగ్గజాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను ఎలా ప్రభావితం చేస్తారో అనే అంశంతో ఈ సినిమా కథ ఉంటుందని, రాజకీయ కోణం కూడా ఈ సినిమాలో ఉందని వెల్లడించాడు. బాలయ్య బావ మరియు ఎ.పి సిఎమ్‌ అయిన చంద్రబాబుకి మరియు రాష్ట్ర మంత్రులందరికీ కలిపి ఒక ప్రత్యేకమైన షో ప్రదర్శించాలనుకుంటున్నాడు. ఈ షో ఈ సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు జనవరి 13న జరగనుంది.

ఈ సినిమా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్‌ కొనసాగించింది. ఈ సినిమా సాటిలైట్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఎరోస్‌ ఇంటర్‌నేషనల్‌, శ్రీవాస్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. థమన్ సంగీతం అందించాడు.

English summary

Dictator premiere show is one day before for AP ministers and Chief Minister. Anjali, Sonal Chauhan and Aksha is romancing with Balakrishna in this movie.