విజయశాంతికి పెళ్ళయ్యిందా?!

Did Vijayashanthi get married?

12:46 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Did Vijayashanthi get married?

ఒకప్పుడు అగ్రతారగా మెరిసిన నటి విజయశాంతి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, కృష్ణ, శోభనబాబు ఇలా స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. ఆ తరువాత అవకాశాలు తగ్గాక రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నికల్లో గెలిచి ఎంపీగా కొంతకాలం కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మీడియా కి ముఖం చాటేశారు. ఇప్పుడు విజయశాంతి ఎక్కడ ఉన్నారు అనే విషయం ఎవరికీ తెలీదు. అయితే గత కొద్ది రోజులుగా విజయశాంతి తన భర్తతో కలిసి ఉన్న ఫోటో మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అయితే విజయశాంతికి పెళ్ళయ్యిందన్న విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే తన పెళ్ళిని అంత గ్రాండ్‌గా జరుపుకోలేదు.

అసలు విషయానికొస్తే విజయశాంతి సినిమాల్లో నటిస్తున్నప్పుడే తన మేనేజర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ ని ప్రేమించింది. ఆ తరువాత అతన్నే పెళ్ళి చేసుకుంది. కానీ ఎటువంటి హడావిడి లేకుండా అతన్ని పెళ్ళి చేసుకోవడంతో విజయశాంతికి పెళ్ళి అయ్యిందన్న విషయం దాదాపు చాలా మందికి తెలీదు. అయితే 2014 ఎన్నికల సమయంలో విజయశాంతి మెదక్‌ స్థానానికి పోటీ చేసినప్పుడు తనకు వివాహం అయ్యిందన్న విషయం అఫిడవిట్‌లో తెలియజేసింది. తన భర్త పేరిట 28 కోట్లు ఆస్తి ఉన్నట్లు, ఇంకా కొన్ని భూములు ఉన్నట్లు తెలియజేసింది. అంతే తప్ప ఇంకెప్పుడూ తనకి పెళ్ళి అయ్యిందన్న విషయం ఎక్కడా తెలుపలేదు.

అయితే ఇప్పుడు విజయశాంతి తన భర్తతో ఉన్న ఫోటోలు బయటకి రావడంతో విజయశాంతికి పెళ్ళయ్యిందా అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

English summary

Telugu actress Vijayashanthi married his manager Srinivas Prasad before so many years. But nobody knows this thing.