ఇంట్లో ఈ మొక్కలు ఉంటే మీ పిల్లలకు ప్రమాదం!

Dieffenbachia plant is very harm for health

03:29 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Dieffenbachia plant is very harm for health

మన ఇంటి ప్రాంగణంలో మొక్కలు అందానికి, మంచి వాతావరణానికి నాటుతాం, పెంచుతాం. ఆ మొక్కలు చూడగానే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేలా చక్కని రూపం, పచ్చదనంతో అందంగా ఉంటాయి. మనలో చాలా మందికి అలవాటే. చాలా మంది ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మాత్రమే కాదు, అలంకరణ కోసం కూడా మొక్కలను పెంచుతుంటారు. దీంతో చెప్పలేనంత మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. అయితే మీకు తెలుసా? మనం ఇండ్లలో పెంచుకునే అన్ని మొక్కలు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మనకు అనారోగ్య సమస్యలను కూడా తెచ్చి పెడతాయి. అవునా, అని ఆశ్చర్యపోకండి. మేం చెబుతోంది నిజమే.

1/4 Pages

ఆ మొక్క పేరు డిఫెన్ బాకియా(Dieffenbachia). ఈ మొక్కకు పెద్ద పెద్ద ఆకులను కలిగి ఉంటుంది. మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు, కాండం, పువ్వులు అన్నీ మనకు అనారోగ్యకరమే. ప్రాణాలకు హాని కలిగించే విష పూరితమైన పదార్థాలు ఈ మొక్కలో ఉంటాయి. ఈ క్రమంలో ఈ మొక్కను ఎక్కడ ముట్టుకున్నా మన శరీరంలోకి విష పదార్థాలు ప్రవేశించి ప్రాణాపాయ స్థితుల్లోకి నెట్టివేస్తాయి. తీవ్రమైన కడుపునొప్పి, నోట్లో, గొంతులో మంట, దృష్టి లోపం, డయేరియా, కంటి నొప్పి, వాంతులు, శరీరమంతా ఉబ్బిపోవడం వంటి అస్వస్థతలు కలుగుతాయి.

English summary

Dieffenbachia plant is very harm for health